గవర్నర్ దత్తాత్రేయకు తృటిలో తప్పిన ప్రమాదం.....

post

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న దత్తాత్రేయ నల్గొండలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కారులో దత్తాత్రేయ పాటుగా అధికారులు ఉన్నారు. కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చెందారు. కొద్దిసేపటి తర్వాత మరో వాహనంలో గవర్నర్ దత్తాత్రేయ అక్కడ్నుంచి బయల్దేరి వెళ్లిపోయారు.