రిటైర్మెంట్ హోమ్‌లో అగ్నిప్రమాదం......

post

రష్యాలోని బాష్‌కోర్టొస్టాన్ ప్రాంతంలోని ఉరల్ పర్వతశ్రేణుల్లో ఉన్న ఓ రిటైర్మెంట్ హోమ్‌లో తెల్లవారుజామున 3 గంటలకు ఆ హోమ్‌లో మంటలు వ్యాపించడంతో 11 మంది మృతి చెందారు. సుమారు మూడు గంటల తర్వాత ఆ మంటల్ని ఆర్పారు. అయితే ఆ హౌమ్‌లో ఉన్నవారంతా వృద్ధులు కావడంతో అగ్ని ప్రమాదం వేళ వేగంగా కదలలేకపోయారు. దీంతో వాళ్లు ఆ మంటల్లో బలయ్యారు. రిటైర్మెంట్ హౌజ్‌లో నలుగురు ప్రాణాలతో బయటపడినట్లు రష్యా ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఘటన పట్ల విచారణ మొదలుపెట్టినట్లు రష్యా అధికారులు వెల్లడించారు.