యువీ మళ్ళీ వస్తున్నాడు......

post

భారత్ క్రికెటర్ యువరాజ్‌ సింగ్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వచ్చే నెల ప్రారంభం కానున్న దేశవాళీ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆడడానికి సిద్ధమవుతున్నాడు. గతేడాది జూన్‌లో అతడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, 'పంజాబ్‌ క్రికెట్ అసోసియేషన్‌' కార్యదర్మి పునీత్‌ సంప్రదించడంతో తన సొంత రాష్ట్రం కోసం తిరిగి ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దేశవాళీ టీ20 ట్రోఫీకి పంజాబ్‌ జట్టులోని 30 మంది ప్రాబబుల్ ఆటగాళ్ల జాబితాలో యువరాజ్‌ పేరు నమోదైంది.ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ యువీ మైదానంలో మెరవడం అభిమానులకు ఖుషి చేస్తుంది.