పెళ్లింట విషాదం....

post

కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలం చిన్నదేవాడలో ట్రాక్టర్‌ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్‌తో నీళ్లు తీసుకువస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు తుకారాం, సాయిలు, శంకర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా డ్రైవర్‌ ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తెల్లవారితే పెళ్లి జరగాల్సిన ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.