పెన్నానదిలో 7గురు విద్యార్థుల గల్లంతు......

post

నిన్న సిద్దవటం వద్ద పెన్నానదిలో ఏడుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 4 మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్ల మిగిలిన వాళ్ళ కోసం గాలిస్తున్నారు. సిద్దవటంలో స్నేహితుడి ఇంట్లో కర్మకాండ కార్యక్రమానికి వచ్చి ఏడుగురు యువకులు జలసమాధి అయ్యారు. జలసమాధి అయిన వారిలో జగదీష్, తరుణ్, షణ్ముఖం, రాజేష్, సోమశేఖర్, జశ్వంత్, సతీష్ ఉన్నారు.