మొత్తం సిరీస్ కు దూరమైన షమీ...?

post

అడిలైడ్ వేదికగా భారత్,ఆసీస్ మధ్య జరిగిన మొదటి పింక్ బాల్ టెస్ట్ లో ఆసీస్, భారత్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఇన్నింగ్స్ చివర్లో పేసర్ షమీ రిటైర్డ్ హర్ట్ కావడంతో ముగిసిపోయింది. ఆసీస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్ షమీ యొక్క చేయిపై తాకింది. ఈ మ్యాచ్ అనంతరం షమీ గురించి కోహ్లీని ప్రశ్నించగా అతను ఇప్పుడు స్కాన్ కోసం ఆసుపత్రికి వెళుతున్నాడు. అతను చాలా బాధలో ఉన్నాడు, చేయి కూడా ఎత్తలేకపోయాడు. మిగత విషయాలు అతని రిపోట్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయి అని విరాట్ కోహ్లీ వెల్లడించారు. కానీ షమీ గాయం చాలా తీవ్రంగా ఉంది అని, దాంతో అతను ఈ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం అవుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ  అదే జరిగితే భారత్‌ ఇప్పుడు బుమ్రా బౌలింగ్‌ పై ఎక్కువగా ఆధారపడనుంది. ఉమేష్ యాదవ్ పాత్ర కీలకంగా మారనుండగా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని ల్లో ఎవరో ఒకరు జట్టులోకి వస్తారు.