యూపీ లో ఐదుగురు సజీవ దహనం....

post

యూపీ‌లోని ఆగ్రా జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై యూపీ 32 కేడబ్ల్యూ 6788 కారులో ఐదుగురు ఢిల్లీ వైపువెళ్ళుతుండగా ఈరోజు తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఖండౌలి పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో, టోల్‌ప్లాజాకు నాలుగు కిలోమీటర్ల ముందు ఓ ట్యాంకర్‌ను ఓవర్‌టెక్‌ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ట్యాంకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో కారు వేగంగా ఉందని, కంట్రోల్‌ కాకపోవడం ట్యాంకర్‌ డీజిల్‌ ట్యాంకును ఢీకొట్టి ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. వారు సెంట్రల్‌ లాక్‌ కావడంతో వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.గమనించిన పలువురు పోలీసులు, ఫైర్‌ అధికారులకు సమాచారం అందించగా.. వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే ఫైరింజన్‌ వచ్చే సరికే అందులో ప్రయాణిస్తున్న వారంతా కాలిబూడిదయ్యారు. సంఘటన జరిగిన సమయంలో కారులో ఓ మహిళ, చిన్నారి సహా మరో ముగ్గురు వ్యక్తులున్నట్లు తెలుస్తోంది.