ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్‌కూ షమీ డౌటే....!

post

భారత్ సీనియర్‌ పేసర్ మహ్మద్ షమీ ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో మొదలైయే టెస్టు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో షమీ బౌలింగ్‌ వేసే చేతికి ఫ్రాక్చర్‌ అయిన విషయం తెలిసిందే. దీనితో అతడు సిరీస్‌లోని ఆఖరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. ప్రస్తుతం షమి కోలుకోవడానికి, పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి కనీసం ఆరు వారాలు పడుతుందని తెలిసింది. దీంతో ఫిబ్రవరిలో ఇంగ్లీష్‌ టీమ్‌తో తొలి టెస్టులోనూ అతడు ఆడకపోవచ్చని సమాచారం.గాయం నుంచి కోలుకున్న తర్వాత పునరావాసం కోసం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో చేరతాడని' బీసీసీఐ వర్గాలు తెలిపాయి.