యాదాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..

post

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు యాదగిరీశుడు వైకుంఠ ద్వార దర్శనమిచ్చారు. వేకువ జామునే పెద్ద సంఖ్యలో గుట్టపైకి చేరుకొని భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు నుంచి యాదాద్రిలో 6 రోజుల పాటు స్వామి వారి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఆరు రోజుల పాటు వైభవోపేతంగా రోజుకో అలంకార సేవ జరగనుంది. రోజుకో అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. యాదాద్రి పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు.