దేశంలో మరో 14 కొత్తరకం కరోనా కేసులు

post

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త రకం కేసులు భారత్‌లోనూ పెరుగుతున్నాయి. నిన్నటి వరకు ఆరు కేసుల్ని అధికారికంగా గుర్తించిన ప్రభుత్వం తాజాగా మరో 14 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారించింది. దీంతో దేశంలో కరోనా కొత్త రకం కేసుల సంఖ్య 20కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 18-19 కేసులు గుర్తించినట్లు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రయోగశాల వర్గాలు మంగళవారమే సంకేతాలిచ్చాయి. అయితే, ఈ విషయాన్ని తాజాగా కేంద్రం ధ్రువీకరించింది.