ఆరుగురు యువకులు, 13 పశువులు మృతి

post

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లా గజ్రౌలాలో ఈరోజు తెల్లవారుజామున పశువులను తీసుకెళ్తున్న కంటైనర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా, 13 పశువులు మృతి చెందాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న పశువుల కళేబరాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.