శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘనవిజయం.......

post

శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్టును మూడు రోజుల్లోనే ముగించి లంకేయులపై ఆతిథ్య సఫారీ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. మంగళవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో లంకను 211 పరుగులకు ఆలౌట్‌ చేసిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత 67 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమీ కోల్పోకుండా ఆడుతూ పాడుతూ ఛేదించింది. లుంగీ ఎంగిడి (4/44), లతో సిపమ్లా (3/40), అన్రిచ్ నార్జ్‌ (2/64) లంక పతనాన్ని శాసించారు. ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 91తో బ్యాటింగ్‌ కొనసాగించిన కరుణరత్నె సెంచరీ (103: 128 బంతుల్లో 19x4) పూర్తి చేసుకున్నా.. త్వరగానే ఔటయ్యాడు. మొత్తంగా 67 పరుగుల టార్గెట్ దక్షిణాఫ్రికా ముందు నిలిచింది. 67 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా వికెట్లేమీ కోల్పోకుండా ఆడుతూ పాడుతూ ఛేదించింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు మర్‌క్రమ్ (36 నాటౌట్: 53 బంతుల్లో 4x4), డీన్ ఎల్గర్ (31 నాటౌట్: 27 బంతుల్లో 5x4) కేవలం 13.2 ఓవర్లలోనే 67/0లోనే లక్ష్యాన్ని ఛేదించేశారు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం (127: 163 బంతుల్లో 22x4)తో అదరగొట్టిన సఫారీ బ్యాట్స్‌మన్‌ డీన్‌ ఎల్గర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్' అవార్డు దక్కింది.