ఢిల్లీ సరిహద్దులో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ....

post

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యాన్ని సాధించే వరకూ వెనకడుగు వేయబోమని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు స్పష్టం చేశారు. వర్షం కారణంగా బుధవారం వాయిదాపడిన ట్రాక్టర్ల ర్యాలీని ఈరోజు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీక్షా స్థలి నుంచి కుండ్లి-మనేసర్‌-పల్వాల్‌ వరకు వాహనాల ప్రదర్శన కొనసాగనుంది. ఈ నెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే ట్రాక్టర్ల కవాతుకు దీనిని ముందస్తు కసరత్తుగా భావిస్తున్నారు. తీవ్ర చలితో పాటు నాలుగు రోజులుగా వర్షం పడుతున్నప్పటికీ దీక్షా శిబిరాల్లో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల బైఠాయింపు ప్రారంభమై గురువారానికి 43వ రోజుకు చేరుకుంది. పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వేల మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.