దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

post

సూర్యాపేట జిల్లాలోని పాలకీడు మండలం జాన్ పహాడ్ సమీపంలో ఉన్న దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్కన్ ఫ్యాక్టరీ పైన వెల్డింగ్ చేస్తుండగా కింద ఉన్న బెల్ట్ పైన ఉన్న జిప్సం మీద నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. దాంతో రూ.1.10లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో కార్మికులు ఎవరు గాయపడ లేదని ఫ్యాక్టరీ జీఎం నాగమల్లేశ్వరరావు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.