రిషభ్‌ పంత్‌ అరుదైన రికార్డు....!

post

బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తన పేరిట రికార్డును నమోదు చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలు రాయిని అందుకున్న భారత్ వికెట్‌ కీపర్లలో అతను రికార్డు నెలకొల్పాడు. భారత్‌ తరుఫున అతి తక్కువ (27) ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించిన ఆటగాడిగా రికార్డు కెక్కాడు. ధోనీ 32 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించి రెండో స్థానంలో నిలవగా, ఆ తరువాతి స్థానాల్లో ఫరోక్‌ ఇంజనీర్‌ 36 ఇన్నింగ్స్‌ల్లో, వృద్ధిమాన్‌ సాహా 37 ఇన్నింగ్స్‌ల్లో, నయన్‌ మోంగియా 39 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు.