ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.....

post

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్‌ ‌లో భారత్ టెస్ట్ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఛతేశ్వర్‌ పుజారా ఆరోస్థానానికి చేరుకోగా ,పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఏడో ర్యాంక్ లో ఉండగా , భారత్‌ టెస్టు జట్టు వైస్‌కెప్టెన్‌ రహానె ఎనిమిదో స్థానంలో నిలిచాడు. భారత్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌ వరుసగా రెండు, మూడు  స్థానాలలో కొనసాగుతున్నారు . టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, బుమ్రా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో  ఉండగా , ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా మూడు, అశ్విన్‌ ఆరో ర్యాంకులో కొనసాగుతున్నారు.