గుస్సాడీ నృత్య కళాకారులకు పద్మశ్రీ పురస్కారం దక్కడం అభినందనీయం.....

post

భారతీయ ప్రాచీన కళలకు ప్రాణం పోస్తున్న కళాకారులను పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం అభినందనీయమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీాత, గుస్సాడీ నృత్య కళాకారడు కనక రాజు బృందాన్ని గవర్నర్ తమిళి సై ఘనంగా సన్మానించారు. తెలంగాణ నుంచి గిరిజన కళాకారుడిగా తన టీంకు పద్మశ్రీ అవార్డు పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని కనకరాజు తెలిపారు .అనంతరం కనక రాజు బృందంతో కలిసి గవర్నర్ తమిళిసై గుస్సాడీ నృత్యం చేసి అందరినీ అలరించారు.