నాగోబా జాతర ప్రారంభం

post

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతర ఆదివాసీలకు అతిపెద్ద జాతర ఘనంగా ప్రారంభం కాగా గత అర్ధరాత్రి మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలతో జాతరను ప్రారంభించారు. పుష్యామవాస్య వేళ హస్తినమడుగు నుంచి తెచ్చిన పవిత్ర గంగా జలంతో నాగదేవుడిని అభిషేకించిన మెస్రం వంశస్తుల మహాపూజారి కటోడా హన్మంతరావు, మెస్రం వంశుస్తులు పటేల్ వెంకట్రావ్ నేతృత్వంలో మహాపూజ రాత్రి 11:40 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది.ప్రభుత్వం తరపున కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ విష్ణు వారియర్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు. నాగోబా జాతరకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.