రెండో టెస్ట్‌లో భారత్ విజయం......

post

భారత్ ,ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా 317 పరుగులతో ఇంగ్లండ్‌ పై విజయం సాధించింది.తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా , రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు తీశాడు . తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు కుప్ప కూలిన ఇంగ్లండ్, రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది . ఈ మ్యాచ్ లో 8 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు . పరుగుల పరంగా చూస్తే టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ కు ఇది ఐదో భారీ విజయం. ఇదే స్టేడియంలో మొదటి టెస్ట్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది భారత్.