పంచె కట్టులో పవన్......

post

మలయాళ సూపర్‌హిట్ సినిమా 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌'ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో బిజుమేనన్‌, పృథ్వీరాజ్‌లు పోషించి పాత్రలను తెలుగులో పవన్‌కల్యాణ్‌, రానా పోషిస్తున్నారు. కాగ ఈ సినిమా ఐశ్వర్యరాజేశ్‌, సాయిపల్లవి పేర్లు హీరోయిన్స్ గా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పవన్ తాజాగా పంచె కట్టులో మెరిసారు. కార్ వ్యాన్ నుండి పంచె ధరించి వస్తున్న పవన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ లుక్‌లో పవన్‌ని చూసిన అభిమానులు తెగ మెరిసిపోతున్నారు.