త్రివిక్రమ్ తో నా సినిమా ఉంటది ......  

post

టాలీవుడ్ హీరో రామ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రానున్నట్టు ఇప్పటికే పలుసార్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే త్రివిక్రమ్ మరోవైపు ఎన్టీఆర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పట్లో రామ్ తో సినిమా ఉండకపోవచ్చనుకున్నారు సినీ జనాలు. అయితే దీనిపై క్లారిటీ వచ్చింది. రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ త్రివిక్రమ్ తో సినిమా విషయమై క్లారిటీ ఇచ్చాడు. నా కోసం కథ రాస్తున్నారన్న వార్తల్లో వాస్తవం కాదు. కానీ త్రివిక్రమ్ నన్ను డైరెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా మా ఇద్దరి కాంబినేషన్ లో పక్కా సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు.