మమ్ముట్టీ సరసన అనసూయ .....?

post

ఒక పక్క బుల్లి తెర మీద సందడి చేస్తూనే మరో పక్క సినిమాలలో నటిస్తూ అబ్బుర పరుస్తోంది యాంకర్ అనసూయ. ఇటీవల ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పింది ఆమె. అందులో హీరో విజయ్ సేతుపతి సరసన ఈ భామ చేయనుందట. అంతేకాకుండా తెలుగులో కూడా సునీల్ సరసన హీరోయిన్‌గా చేసేందుకు ఓకే చెప్పిందట. అయితే ఇప్పుడు తాజాగా ఓ మలయాళీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో స్టార్ హీరోకి జోడీగా కనపించనుందట. అతడెవరో కాదండీ మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టీ సరసన హీరోయిన్ గా నటించనున్నదంట. అయితే ఈ ముద్దుగుమ్మ మమ్ముట్టితో కలిసి ఇంతకు ముందే ఓ సినిమా చేసింది. యాత్రా సినిమాలో మమ్ముటి సరసన అందరిని మెప్పించింది. అయితే ఈ సారి చేయనున్న సినిమాతో మలయాళంలోకి అరంగేట్రం చేయనుంది. అంతేకాకుండా ఆమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తుందని టాక్ నడుస్తోంది. వీటిపై అమ్మడు క్లారిటీ ఇవ్వాలి.