చిట్టి నా బుల్‌ బుల్‌ చిట్టి..  అంటున్న' జాతిరత్నాలు'

post

నటుడిగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా గుర్తింపు సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా బ్రేక్‌ సాధించాడు. ఇప్పుడు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలతో కలిసి నవీన్‌ పొలిశెట్టి కలిసి నటిస్తున్న సినిమా 'జాతిరత్నాలు'. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాకు అనుదీప్‌ కేవీ దర్శకుడు. రధన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో 'చిట్టి నా బుల్‌ బుల్‌ చిట్టి...' అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ముగ్గురు ఖైదీల పాత్రల్లో కనిపిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల క్లారిటీ ఇవ్వనుంది చిత్ర యూనిట్‌.