'రెడ్' వేడుకలో 'క్రాక్' టికెట్ అమ్మిన రామ్....
రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న 'రెడ్' సినిమా సంక్రాంతి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం వైభవంగా జరిగింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. వేడుకలో భాగంగా హీరో రామ్ మొదటి టికెట్ ను త్రివిక్రమ్ కు అమ్మాల్సి ఉంటుంది. బిగ్ టికెట్ ను రామ్ నుండి త్రివిక్రమ్ స్వీకరించేందుకు ఒక టికెట్ ను రెడీ చేశారు. ఆ టికెట్ ను రామ్ చేతుల మీదుగా ఇప్పించారు. అయితే ఆ టికెట్ పై రెడ్ కు బదులుగా క్రాక్ ఉంది. ఇంతకు ముందు క్రాక్ మూవీ కోసం తయారు చేసిన టికెట్ ను ఇప్పుడు రెడ్ సినిమాకు తీసుకు వచ్చేశారు. ఇది ఈ వెంట్ నిర్వాహకులు చేసిన తప్పు. ఆ విషయాన్ని వారు ముందు చూసుకోవాలి. రామ్ చూసుకోకుండా ఆ టికెట్ ను త్రివిక్రమ్‌కు అందించేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కొందరు అది రెడ్ మూవీ కాదని క్రాక్ అంటూ చెప్పడంతో క్రాక్ పై రెడ్ స్టిక్కర్ వేశారు. అయినా కూడా అప్పటికే సోషల్ మీడియాకు ఆ క్లిక్ దొరికింది. దాంతో అంతా దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు.