'క్రాక్' కు వెంకటేష్ నో చెప్పాడా ....?
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్' సినిమా సంక్రాంతి కానుకగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాకు తెచ్చుకున్నది . అయితే ఈ సినిమా కథ మొదట వెంకటేష్ వద్దకు వెళ్లింది అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వెంకీ కథ విషయంలో నమ్మకం కలుగక పోవడంతో మార్పులు చేప్పాడని తెలుస్తోంది. వెంకటేష్ కథ విన్న తర్వాత చెప్పిన మార్పులకు గోపీచంద్ చేసేందుకు సిద్ద పడలేదు. అదే కథను రవితేజ వద్దకు తీసుకు వెళ్లగా ఆయన ఓకే చెప్పాడు. అప్పటికే ఇద్దరి కాంబోలో రెండు సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక గోపీచంద్ ను రవితేజ నమ్మాడు. తప్పకుండా చేద్దాం అని ఠాగూర్ మధు వద్దకు కథను తీసుకు వెళ్లగా ఆయన నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అలా క్రాక్ మొదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.