రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన సుజీత్.....

post

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో 'ఛత్రపతి 'రీమేక్ చేస్తున్నారన వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ రీమేక్ కు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మధ్యే ఆయన సన్నిహితులు స్పందించి రీమేక్ కు ఆయన దర్శకత్వం వహించడం లేదని యూవీ క్రియేషన్స్ లోనే ఆయన మూడవ సినిమా ఉంటుందని అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు. తాజాగా దర్శకుడు సుజీత్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. తాను ఏ రీమేక్ చేయడం లేదు అంటూ ట్వీట్ చేశాడు. దాంతో అతడు చత్రపతి రీమేక్ విషయమై ఆసక్తిగా లేడని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ప్రభుదేవాతో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.