"ప్రత్యర్థి" సినిమా ప్రారంభం.....!

post

శంకర్ ముడావత్ దర్శకత్వంలో రవి వర్మ , వంశీ, రోహిత్ బెహల్, అక్షిత సొనవనే ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా  "ప్రత్యర్థి".  పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంజయ్ షా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు . ఈ సినిమా ప్రారంభోత్సవం నవంబర్ 21న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. పూజా కార్యక్రమాలు అనంతరం రవి వర్మ, వంశీ, అక్షిత సొనవనే లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ నివ్వగా, నాగర్ కర్నూల్ టి ఆర్ యస్ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు బీమ్స్ సేసిరోలియో సంగీతం అందిస్తున్నాడు .