'సర్కారు వారి పాట' ప్రారంభం....!

post

పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న'సర్కారు వారి పాట' సినిమా పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. చిత్ర యూనిట్ తో పాటు మహేశ్‌ బాబు భార్య నమ్రత, కూతురు సితార తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్ బాబు కూతురు  సితార ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టగా, మహేష్ భార్య నమ్రత కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వచ్చే సంవత్సరం జనవరి మొదటి వారంలో సినిమా షూటింగ్ మొదలుకాబోతున్నదని  చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ ట్వీట్‌ చేసింది.14 రీల్స్‌ సంస్థ, మైత్రి మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఎస్‌. తమన్ సంగీతం అందిస్తున్నాడు .