చిరు రీమేక్ కి దర్శకుడు అతడేనా ......

post

మలయాళంలో భారీ విజయం సాధించిన 'లూసిఫర్' సినిమాను తెలుగులో చిరంజీవి రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు . అయితే ఇప్పటికే పలువురు దర్శకులు ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా మోహన్ రాజా దర్శకత్వంలో రీమేక్ అవుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . కోలీవుడ్ లో పలు హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన ఆయన రూపొందించిన 'తని ఒరువన్'  సినిమాను రామ్ చరణ్ 'ధ్రువ' పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు . తెలుగులో ఎన్నో సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ మోహన్ రాజా.ఏది ఏమైనా దీని పై అధికారకంగా ప్రకటన వచ్చేంతవరకు చూడాలి .