రాధిక, శరత్ కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష....

post

నటుడు శరత్ కుమార్, అతని భార్య, సీనియర్ హీరోయిన్ , నిర్మాత రాధికా శరత్ కుమార్‌ల దంపతులతో పాటు మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే ఇప్పుడు వీరికి చెన్నైలోని సైదాపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2017నాటి చెక్ బౌన్స్ కేసులో  శరత్ కుమార్ దంపతులకు న్యాయస్థానం సంవత్సరం శిక్ష విధించింది. అసలు ఏమైందంటే శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌ ఓ సినిమా కోసం రేడియాన్ అనే మీడియా సంస్థ  నుండి వీరు పెద్ద మొత్తంలో అప్పుగా డబ్బులు తీసుకొని ,వారికీ చెక్ లు ఇచ్చారు . అయితే వీరు తీసుకున్న అప్పును సమయానికి తీర్చలేకపోయారు. ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. ఈ విషయం పై సదరు సంస్థ కోర్టుకు వెళ్లింది. ఈ కేసులో వీరికి 2019లో అరెస్ట్ వారెంట్ కూడా జారీ కాగా తాజాగా ఇప్పుడు తీర్పు ఇచ్చిన న్యాయస్థానం ఏకంగా వీరికి ఏడాది జైలు శిక్ష విధించింది.