లక్ష్మీ రాయ్ నిశ్చితార్థం..!

post

తెలుగు ,కన్నడ , తమిళ్ లో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ రాయ్ తెలుగులో  మాత్రం స్పెషల్ సాంగ్స్‌తో బాగా పాపులర్ అయింది. అయితే ఆమె తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమెకు హీరోయిన్ గా  పెద్దగా అవకాశాలు రాకపోవడంతో  స్పెషల్ సాంగ్స్ పైన ఫోకస్ పెట్టింది . ఆమె బాలీవుడ్‌లో నటించిన జూలీ 2 సమయంలో రాయ్ లక్ష్మీ అని పేరు కూడా మార్చుకుంది. అయితే బాలీవుడ్‌లో కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ చేతిలో రెండు తమిళ సినిమాలు ఒక తెలుగు సినిమా, ఒక కన్నడ, ఒక మలయాళ సినిమాలు ఉన్నాయి. ఆమె తెలుగులో కాకపోయినా తమిళంలో మాత్రం బాగానే సినిమాలు చేస్తుంది. అయితే ఆమె తన ఎంగేజ్‌మెంట్‌ డేట్ ను తన అభిమానులతో వెల్లడించింది. ఈ నెల 27న ఆమె నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణాయించారని, అయితే నా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను బయటపెట్టాలనుకోవడం లేదు.. అంటూ ఆమె చెప్పుకొచ్చింది.