"రౌడీ బాయ్స్"గా  ప్రముఖ నిర్మాత మేనల్లుడి.... 

post

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒక్కరైన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. అయితే ఇప్పుడు ఆయన మేనల్లుడు ఆశిష్ వెండితెరకు పరిచయం కావడానికి రంగం సిద్ధమైంది. ఆశిష్ హీరోగా నటిస్తున్న సినిమాకు 'రౌడీ బాయ్స్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ఆశిష్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  ఈ సినిమాను  దిల్ రాజు నిర్మిస్తున్నాడు . ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు 'రౌడీ బాయ్స్'ను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్  ప్రకటించారు.