'ఏజెంట్' ఫస్ట్ లుక్.... 

post

ఈరోజు అక్కినేని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అఖిల్ కొత్త సినిమా 'ఏజెంట్' ఫస్ట్ లుక్ పోస్టర్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశాడు . ఈ పోస్టర్ లో అఖిల్  సిగెరెట్ట్ తాగుతూ కనిపించాడు .ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ చూస్తుంటే ఈ సినిమా కథ ఓ స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. అంతేకాకుండా ఈసినిమాను డిసెంబర్ 24 , 2021 న విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అఖిల్ ప్రస్తుత్తం  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాలో నటిస్తున్నాడు .  పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా  జూన్ 19 న ప్రేక్షకుల ముందుకురానున్నది . ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.