దీపికా పడుకోణె ఇంట్లో అందరికీ కరోనా... 

post

కరోనా సెకండ్ వేవ్ ఎవరిని వదలడం లేదు . ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడగా తాజాగా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోణె ఇంట్లో అందరికి కరోనా సోకింది . ఆమె తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకోన్‌,తల్లి ఉజాలా, చెల్లెలు అనీషాలకు ఇలా అందరికి కూడా కరోనా సోకింది. పది రోజుల కిందట ఇంట్లో అందరికీ స్వల్ప లక్షణాలు కనిపించడంతో అందరు టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ప్రకాశ్ సన్నిహితుడు, ఆయన బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్ విమల్ కుమార్ చెప్పారు. వారం రోజులు ఇంట్లోనే ఉన్నా ప్రకాశ్‌కు జ్వరం తగ్గకపోవడంతో హాస్పిటల్‌లో చేర్పించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు దీపికా తల్లి, చెల్లులు ఇంట్లోనే కోలుకుంటున్నారు.