బాలీవుడ్ హీరోయిన్ కి షాక్ ఇచ్చిన ట్విట్టర్...

post

సోషల్ మీడియా ప్రతీ ఒక్కరికీ కూడా తమ భావాలను వ్యక్త పరిచేందుకు అవకాశం ఉన్న అతి పెద్ద ప్లాట్ ఫామ్.ఈ సోషల్ మీడియాలో కూడా సామాన్యులతో పాటుగా మన సినీ తరాలు కూడా ఉంటారు. అయితే వాటిలో ఉండే రూల్స్ మాత్రం ప్రతి ఒక్కరికీ ఒకటే. బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటూ  ట్రెండ్ లో ఉన్న సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. తాజాగా ఆమె బెంగాల్ లో ఎలక్షన్స్ రిజల్ట్స్ గురుంచి పెట్టిన అభ్యంతరకర పోస్ట్ లు వివాదాస్పదమవడంతో ట్విట్టర్ నిబంధనలు మరియు షరతులను ఉల్లంఘించినందుకు ఆమె ఖాతాను నిలిపివేసింది.