పవన్ సినిమాలో పూజా హెగ్దే..!

post

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇటీవలే ఆయన నటించిన 'వకీల్ సాబ్ ' సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది. అయితే ఆయన  హరీష్ శంకర్ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో పవన్.. తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. అయితే కొడుకు లెక్చరర్ పాత్రలో కనిపిస్తుండగా ,తండ్రి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం.. మరి ఈ సినిమా పవర్ స్టార్ కు ఏ రేంజ్ సినిమా అవుతుందో చూడాలి.అయితే దీనిపై అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది.