'ముగ్గురు మొనగాళ్లు' ఫస్ట్‌ లుక్‌...

post

కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఇంతక ముందు హీరోగా పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.'గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ, భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' వంటి సినిమాలలో ఆయన హీరోగా నటించగా ఆ సినిమాలన్నింటిలలో 'గీతాంజలి' సినిమా తప్ప మరే సినిమా కూడా ప్రేక్షకులను  ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఆయన 'ముగ్గురు మొనగాళ్ళు' సినిమాలలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు చిత్ర యూనిట్. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అభిలాష్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను  అచ్యుతరామారావు  నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నదని త్వరలోనే ఈ సినిమా విడుదల డేట్ ప్రకటిస్తామని నిర్మాత పేర్కొన్నాడు.