బెల్లంకొండ, కృతితో తెలుగులో 'వివాహ్'...

post

సూరజ్ బర్జాత్య దర్శకత్వంలో షాహిద్ కపూర్, అమృతా రావు జంటగా నటించిన ‘వివాహ్’ సినిమా 1906లో విడుదలై ఘన విజయం సాధించింది.  అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రీమేక్ లో బెల్లంకొండ గణేశ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ నటిస్తున్నట్లు సమాచారం. తన రెండో కుమారుడిని ఫ్యామిలీ ఆడియన్స్ లోకి తీసుకు వెళ్ళడానికి ఈ సినిమా పనికి వస్తుందని బెల్లంకొండ సురేష్ నమ్ముతున్నాడట. అందుకే ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనుగోలు చేశారట. యూత్ లో  మంచి క్రేజ్ ఉన్న కృతి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఈ సినిమా షూటింగ్ ను ఈ సంవత్సరంలోనే ప్రారంభించి ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట చిత్ర యూనిట్. అయితే దీనిపై అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది.