దర్శకుడు వెంకీ కుడుములతో చైతు...!

post

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ,సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ,నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది.అంతేకాకుండా చైతు బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు . ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో తెలుగు అబ్బాయిగా చైతూ కనిపిస్తాడట.అంతేకాకుండా ఈ సినిమాలో గెస్ట్ రోల్ అయినా దాదాపు 20 నిమిషాల వరకూ ఇతగాడి పాత్ర ఉంటుందట. అయితే తాజాగా నాగచైతన్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడంట . దర్శకుడు వెంకీ చెప్పిన కథ నచ్చడంతో చైతు వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.