బాలకృష్ణతో శృతి హాసన్ ...?

post

మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్' సినిమాలో రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఇప్పుడు దర్శకుడు మలినేని గోపీచంద్  తన సినిమాలో కూడా శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకోనున్నాడంట. 

‘క్రాక్’  సినిమా విజయం సాధించడంతో ఆయన ఏకంగా బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.  మైత్రీమూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనున్నది. ఈ సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. ఈ సినిమాను వచ్చే  సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో బిజిగా ఉన్నాడు . ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ ,గోపీచంద్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట. మరి ఈ సినిమాలో  బాలకృష్ణ, శృతి కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి మరి.