కరోనా తో అసురన్ నటుడు మృతి...

post

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు సినీరాజకీయ ప్రముఖులు కూడా ఈ కరోనా తో ప్రాణాలు విడుస్తున్నారు. బాలీవుడ్ ,టాలీవుడ్ ,కోలీవుడ్ అనే తేడా లేకుండా చాలామంది  సినీప్రముఖులు ఇప్పటికే మృతి చెందుతున్నారు . తాజాగా ధనుష్ హీరోగా నటించిన 'అసురన్' సినిమాలో నటించిన నితీష్ వీర(45) కూడా తాజాగా కరోనాతో మృతి చెందాడు .నితీష్ మరణంతో సెల్వరాఘవన్ ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన పోస్ట్ చేశారు. మరికొంత మంది స్టార్స్ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.