'మహాసముద్రం' అప్డేట్..!

post

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ ,సిద్ధార్థ హీరోలుగా నటిస్తున్న 'మహా సముద్రం' సినిమాలో అదితీరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం వైజాగ్ నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా మొత్తం చిన్నతనం నుంచే ఒకరిపై ఒకరు ద్వేషంతో రగిలిపోయే ఇద్దరు ఆవేశపరులు మధ్య జరిగే యాక్షన్ డ్రామాట.ఈ సినిమాలో ఓ హీరోయిన్ పాత్ర చనిపోతుందట. అలాగే సిద్ధార్థ , శర్వా లుఇప్పటివరకు నటించని అద్భుతమైన పాత్రలో ఈ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అలాగే అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారంట.