డాక్టర్ల 'సిటీమార్‌' స్టెప్పులకు ఫిదా అయినా దిశా పటాని.!

post

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. వైద్యులు తమ వ్యక్తిగత సంతోషాలను పక్కన పెట్టి మరి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది వైద్యులు డ్యాన్స్‌ చేస్తూ కరోనా బాధితులకు చికిత్స అందించడంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సల్మాన్‌, దిశా పటాని జంటగా నటించిన "రాధే" సినిమాలోని సీటీ మార్‌ పాటకు వైద్యులు డ్యాన్స్‌ చేస్తున్నవీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వైద్యుల  వీడియోను బాలీవుడ్‌  ముద్దుగుమ్మ దిషా పటాని ఫ్యాన్స్‌ క్లబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మే 14న హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు కాళ్లు కదుపుతూ చేసిన డ్యాన్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా ఆ వీడియోను 35,515 మంది నెటిజన్లు చూశారు . ఈ వీడియో పై హీరోయిన్ దిశా పటాని స్పందిస్తూ 'నిజమైన హీరోలు' అంటూ ప్రశంసించింది.