మహేష్ బాబు జోడి గా మాళవిక మోహనన్..?

post

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాను పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కి పనులు అన్నీ జరుగుతుండగా మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ సినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందనేది త్రివిక్రమ్ ఆలోచన. కానీ తెలుగులో ఎవరూ దొరకట్లేదు. అందుకే తమిళం, మలయాళం వెతుకుతున్నారట. ఈ వెతుకులాటలో ఒక హీరోయిన్ పేరును గట్టిగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమే మాళవిక మోహనన్. ఈ మలయాళీ బ్యూటీకి మాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల వచ్చిన 'మాస్టర్' చిత్రంతో తెలుగువారికి కూడ పరిచయమైంది. మహేష్ కి సరిగ్గా సరిపోయే స్టచర్ ఉన్న హీరోయిన్.అందుకే ఆమె పేరును పరిశీలిస్తున్నారట. తెలుగులో ఏ హీరోయిన్ దొరక్కపోతే ఆమెనే ఫైనల్ చేస్తారని టాక్.