భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన రామ్..?

post

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఇటీవల “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో ఊర మాస్ గెటప్ తో భారీ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన “రెడ్”  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఈ హీరో సినిమాలకు బాలీవుడ్ లోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. రామ్ నటించిన హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా రామ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా ఇతర భాషల్లోకి డబ్ చేయబడుతుంది. ఈ సినిమాలో రామ్ కి జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ పోతినేని తన కెరీర్‌లో 19వ చిత్రం కానుంది. ఈ సినిమా తరువాత రామ్, మురుగదాస్ కాంబినేషన్ లో మరో ద్విభాషా చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన సుమారు రూ .10 కోట్ల రూపాయలను పారితోషికంగా డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.