సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం...

post

తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకున్నది . తెలుగు లెజెండరీ సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ గుండెపోటుతో ఈరోజు ఉదయం (గురువారం) చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. రత్న కుమార్‌ ఇటీవల కరోనా వైరస్ బారీన పడ్డి ట్రీట్ మెంట్ అనంతరం కరోనా నుంచి కోలుకున్నారు. అయితే రత్న కుమార్ చాలా రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు తాజాగా హార్ట్ ఎటాక్‌ రావడంతో చెన్నైలోని కావేవి హాస్పటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘంటసాల రత్న కుమార్ సినీ పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చాలా పాపులర్ అయ్యారు. రత్న కుమార్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.