కత్రినా, విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉందని రివీల్ చేసిన స్టార్ హీరో కుమారుడు....

post

బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ ,నటుడు విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉందని, వారిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని స్టార్ హీరో కుమారుడు వెల్లడించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది బాలీవుడ్ లో. అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ నటుడిగా పరిచయమున్న అతడు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మీరు నిజమని నమ్ముతున్న ఒక బాలీవుడ్ జంట లవ్ రూమర్స్ మీద స్పందించాలన్న వెంటనే.. కత్రినా.. విక్కీ రిలేషన్ మీద ఓపెన్ అయ్యాడు. వారిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని,  తాను వాస్తవమే చెప్పానని చెప్పాడు. అయితే.. ఆ విషయాన్ని తాను చెప్పటం ద్వారా తనకు ఏమైనా ఇబ్బందులు వస్తాయన్న విషయం తెలీదన్న అతడు.. వారిద్దరూ తమ మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పేశారంటూ తన వాదనను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.