కుర్రాళ్లలో వేడిపుట్టిస్తున్నబిగ్‌బాస్‌ బ్యూటీ....

post

'ఉయ్యాలా జంపాల' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన పునర్నవి భూపాలం.పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నప్పటికి  చెప్పుకో దగ్గ పేరు మాత్రం రాలేదు. ఇటీవల వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3 లో హౌస్ లో అడుగు పెట్టిన ఈ భామ ఒక్కసారిగా ఫేమస్ అయిపొయింది. దానికి కారణంహౌస్ లో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో ఉన్న కెమిస్ట్రీయే కారణమనే చెప్పాలి. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగటంతో వీరి మధ్య ఎదో ఉందని సోషల్ మీడియా కోడైకూసింది.ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఈ భామ కి సంబంధించిన ఓ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెడిటేషన్ చేస్తున్న ఉన్న ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.