'మా' అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్‌...

post

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ 'మా' అధ్యక్ష బరిలో బరిలో దిగనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఈ విషయం తెలియజేశారు. తెలుగు సినీపరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, వాటిని అధిగమించడడానికి తన వద్ద సరైన ప్రణాళిక ఉందన్నారు. తెలుగు సినీపరిశ్రమ చాలా పెద్దదన్న ప్రకాశ్‌రాజ్‌ 'మా'కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. 'మా'కు ఇప్పటివరకు సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడిని అయితే 100 శాతం సొంత భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు సాయం చేయడానికి తెలుగు సినీపరిశ్రమలో ఎంతోమంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తానని తెలిపారు.