క్రేజీ బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన తమన్నా...

post

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గత దశాబ్ద కాలంగా సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి చెక్కు చెదరని తన అందంతో అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. ప్రస్తుతం ఈ భామ 'మాస్ట్రో ' సినిమాతో పాటు 'ఎఫ్3' సినిమాలో నటిస్తోంది. ఇటీవల డిస్నీ + హాట్‌స్టార్ సిరీస్ “నవంబర్ స్టోరీ”లో నటించిన తమన్నా తెలుగులో ఓ వంట కార్యక్రమానికి హోస్ట్‌గా టెలివిజన్‌ రంగంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది.  తాజాగా తమన్నా ను ఓ ఇంటర్వ్యూ లో మీ అందం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించగా, లాలాజలం అని ఏమాత్రం తడుముకోకుండా చెప్పేసింది. ముఖంపై మొటిమలు రాకుండా ఉండడానికి లాలాజలం బాగా ఉపయోగపడుతుందట. ఉదయం లేవగానే తన లాలాజాలం (సలైవా)ను ముఖానికి అప్లై చేస్తానని చెప్పింది ఈ భామ .  సలైవా స్కిన్ ప్రాబ్లమ్స్ ను బాగా క్లియర్ చేస్తుందని క్రేజీ ఆన్సర్ ఇచ్చింది ఆమె.